Header Banner

జగన్ హయాంలో లక్ష కోట్ల లిక్కర్ స్కాం… ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదు! మంత్రి తీవ్ర విమర్శలు!

  Thu Apr 10, 2025 13:28        Politics

ఆంధ్ర ప్రదేశ్‌ (Andhra Pradesh)లో ఢిల్లీ (Delhi)కి మించిన లిక్కర్ స్కామ్ (Liquor scam) జరిగిందని... ఈ కేసులో బాధ్యులు ఎవరూ తప్పించుకోలేరని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Miniser Kollu Ravindra) స్పష్టం చేశారు. ఈ సందర్బంగా గురువారం ఆయన అనంతపురం (Anantapuram)లో మీడియాతో మాట్లాడుతూ... ఇప్పటికే లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సిట్ (SIT) పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తోందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక మంచి మద్యం పాలసీ (Liquor policy) అమలు చేస్తున్నామన్నారు. గత వైసీపీ (TCP) పాలనలో లక్ష కోట్లు నాన్ డిజిటల్ పేమెంట్స్ (Digital Payments) జరిగాయని... ఇప్పుడు 52 శాతం డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయని, ఏపీ బార్డర్స్‌లో మద్యం విక్రయాలు బాగా పెరిగాయన్నారు. దీని వలన రాష్ట్రానికి ఆదాయం భారీగా పెరిగిందని మంత్రి తెలిపారు. బెల్టు షాపుల మీద ఉక్కు పాదం మోపుతున్నామని, బెల్టు షాపు అనుబంధంగా ఉన్న షాపుల లైసెన్స్ రద్దు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, హత్యలు, అక్రమ కేసులతో రెచ్చిపోయారని, 44 రోజుల పాటు తాను కూడా రాజమండ్రి జైల్లో ఉన్నానని చెప్పారు. జగన్ పాపిరెడ్డిపల్లిలో పోలీసుల్ని బట్టలూడదీస్తానంటూ వ్యాఖ్యలు చేశారని, టీడీపీ నేతల్ని ఇబ్బంది పెట్టిన పోలీసులకు ప్రమోషన్లు ఇచ్చారని అన్నారు. జగన్ పోలీసుల ప్రతిష్టను, ఆత్మస్తైర్యాన్ని దెబ్బతీస్తున్నారని, వాళ్లు అధికారంలోకి వస్తే తలలు తీస్తామని ఓ మాజీ మంత్రి (కారుమూరి నాగేశ్వరరావు) అంటున్నారని, ఖచ్చితంగా వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
లిక్కర్‌ మాఫియాను వదిలిపెట్టం..
గత ఐదేళ్ల కాలంలో జగన్‌ జమానాలో సాగిన లిక్కర్‌ మాఫియా కేసులో ఎవరినీ వదలి పట్టేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మద్యంలో జరిగిన అవినీతి అక్రమాలను ఆ పార్టీ నేతలే బట్టబయలు చేశారన్నారు. క్యాష్‌ అండ్‌ క్యారీ పద్ధతిలో దాదాపు రూ.లక్ష కోట్లు లావాదేవీలు జరగడంపై సీఐడీ విచారణ జరుగుతోందని తెలిపారు. మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన జగన్‌.. మద్యం వ్యాపారాన్ని చేతుల్లోకి తీసుకున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆరు రాష్ట్రాల్లో మద్యం పాలసీని అధ్యయనం చేసి, నూతన విధానానికి శ్రీకారం చుట్టామన్నారు. మద్యం నాణ్యతపై 13 రకాల పరీక్షలను 5 ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. అమరావతిలో ఇ-13, ఇ-15 కీలక రహదారుల విస్తరణ! అక్కడో ఫ్లైఓవర్ - ఆ ప్రాంతం వారికి పండగే!

 

వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #LiquorScam #JaganRule #APPolitics #KolluRavindra #LiquorMafia #NoOneWillBeSpared